తేది:6-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర సీఐడీ శాఖ ప్రజలకు మరింత సులభతరమైన, బాధితులకు అనుకూలమైన పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో జనవరి 27 నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
ఈ విధానం ద్వారా పోక్సో కేసులు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే సున్నితమైన నేరాల విషయంలో బాధితులు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ నివాసం లేదా అనుకూలమైన ప్రదేశంలోనే ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది.
ఈ క్రమంలో రేగోడ్ మండలంలో ఇటీవల జరిగిన హత్య కేసులో బాధితుని ఇంటివద్దే ఫిర్యాదు స్వీకరించడం గమనార్హం. సీఐపీ శ్రీమతి రేణుక రెడ్డి గారు, రేగోడ్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పోచయ్య గారు స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి ఫిర్యాదును నమోదు చేశారు.
ఈ కొత్త విధానం ద్వారా బాధితులకు త్వరిత న్యాయం అందడమే కాకుండా, ప్రజల పట్ల సానుభూతితో కూడిన బాధ్యతాయుత పోలీసింగ్ సేవలు అందుతున్నాయని అధికారులు తెలిపారు.