పెట్రోలియం ఉత్పత్తుల సంరక్షణ మరియు వినియోగంపై పాఠశాల విద్యార్థులకు అవగాహన.

తేది:06-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.

జగిత్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లిపూర్ లో పాఠశాల విద్యార్థులకు పెట్రోలియం ఉత్పత్తుల సంరక్షణ, వినియోగంపై సాక్ష్యం ఆధ్వర్యంలో అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తులను అవసరం మేరకే వినియోగించుకోవాలని భవిష్యత్ తరాలకు వనరులను సంరక్షించి సుస్థిర అభివృద్ధికి పాటుపడాలని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గుర్రం శ్రీనివాస్, బొమ్మగంటి రవికుమార్, రాజేందర్, వసంతరావు, జీవన్ రెడ్డి,రాజశేఖర్, రాజన్న,లక్ష్మి,మహేష్, శంకరయ్య, ఆనంద్ బాలమురళి, రతిలాల్, మల్లారెడ్డి, రజిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *