అధికార పార్టీ అండ నాకు ఉంది నాతోనే అభివృద్ధి సాధ్యం అంటున్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్.

తేది:06-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.

జగిత్యాల జిల్లా: అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఆలూరు, రాజ్నగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి రూ. 10 లక్షల చొప్పున మంజూరు కాగా, భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా సంఘాలకు శాశ్వత భవనాల కల్పనతో స్వయం ఉపాధికి దోహదం కలుగుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *