రాయికల్ మండలం కొత్తపేట శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష సమావేశం.

తేది:06-02-2026 TSLAW NEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలంలోని కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర నాగాలయం లో నిర్వహించే శివరాత్రి జాతర ఉత్సవాలపై ఆలయ కమిటీ నిర్వాహకులు మండల అధికారులతో తేది:05-02-2026 గురువారం ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తహసిల్దార్ నాగార్జున మరియు ఎస్సై సుధీర్ రావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా తాగునీరు, టాయిలెట్లు, మెడికల్ కిట్లు, బస్సు రవాణా సౌకర్యాలు మరియు అంబులెన్స్ సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అన్నారు.

ఎస్సై సుదీర్ రావు మాట్లాడుతూ:
ఉత్సవాలను నిర్ణీత సమయానికే నిర్వహించేలా ఆలయ కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉత్సవాల్లో అందరూ పోలీసు వారికి సహకరించాలని జాతర ఉత్సవాలకు ఆటంకం కలిగించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం కొత్తపేట సర్పంచ్ మీనుగు అంజయ్య మాట్లాడుతూ జాతర ఉత్సవాలకు అధికారులతో పాటు గ్రామ ప్రజలందరూ సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అలాగే రాత్రిపూట నడిచే కొత్తపేట – జగిత్యాల బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారి ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుష్మ, ఆలయ ఈవో విక్రమ్, వైద్యధికారి సతీష్,ఆర్టీసీ అధికారి రవీందర్,ఆలయ కమిటీ చైర్మెన్ దానవేని రాము, డైరెక్టర్లు వెంకట్, సత్తన్న, సత్యనారాయణ, ముత్యం, కొత్తపేట సర్పంచ్ రాజగంగు – అంజయ్య, ఒడ్డెర కాలనీ సర్పంచ్ చంద్రశేఖర్ లతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *