తేది:03-02-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: అల్లాదుర్గం జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా మండల పరిధిలోని చేవెళ్ల గ్రామములో జొన్న పంటపై క్షేత్ర స్థాయి ప్రదర్శన కార్యక్రమం మంగళవారం వ్యవసాయ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజేష్ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా సి ఎస్ వి 41 జొన్నరకం మన నేల రకాలలో వాతావరణ పరిస్థితుల్లో జొన్న పంట స్థితిగతులపై ట్రయల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అధిక దిగుబడి తదితర అంశాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజు, గ్రామ రైతులు, రాయప్ప, నరసప్ప, బోరంచ విట్టల్, నాగన్న, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.