ఏడుపాయల మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై – కలెక్టర్ రాహుల్ రాజ్ గారి నేతృత్వంలో విస్తృత సమీక్ష.

తేది:28-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .

మెదక్ జిల్లా: ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏడుపాయల వన దుర్గ భవాని మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ గారు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీ నగేష్ గారు, అదనపు ఎస్పీ శ్రీ మహేందర్ గారు, అలాగే రెవెన్యూ, పోలీస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఆర్టీసీ, మున్సిపల్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాతరకు లక్షలాది భక్తులు హాజరయ్యే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరాలు, విద్యుత్ సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు వంటి అంశాలపై కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముందస్తుగా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల భద్రతపై అధిక శ్రద్ధ వహించాలని తెలిపారు.
మహాశివరాత్రి జాతరను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారు అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *