అగ్రరాజ్యం అమెరికాలో కొవీఢ్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు విడిచారు. కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ.. కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక బుధవారం ఒక్కరోజే 884 మంది మృతిచెందడం అగ్రరాజ్యంలో ఆందోళన కలిగిస్తోంది.కరోనాతో ఒక్కరోజులో అత్యధిక మంది మృతి చెందడం ఇదే కావడం గమనార్హం. అక్కడ కరోనా మృతుల సంఖ్య 5000 దాటింది. నిన్న ఒక్కరోజే 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రానికి 5,110 మంది అమెరికన్లు కరోనా బారినపడి మృతి చెందారు.