జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలసిన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TGSCPCR) ఛైర్పర్సన్ సీత దయాకర్ రెడ్డి కమిషన్ సభ్యులు.

తేది:22- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TGSCPCR) ఛైర్పర్సన్ కొత్త కోట సీత దయాకర్ రెడ్డి గారు మరియు కమిషన్ సభ్యులు వచన కుమార్, వందన గౌడ్, మర్రిపల్లి చందన,బి. అపర్ణ, గోగుల సరిత మరియు ప్రేమలత అగర్వాల్ గురువారం రోజున జగిత్యాల జిల్లాకు అధికారిక పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలసి జిల్లాలో అమలవుతున్న బాలల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ విభాగాలతో సమీక్ష సమావేశం నిర్వహించి, పిల్లల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖలు బాధ్యతాయుతంగా పనిచేయాలని, సమిష్టి కృషితో పిల్లల సంక్షేమాన్ని మెరుగుపరచాలని సూచించారు.
పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు జిల్లాలోనిపుడూరు అంగన్వాడి కేంద్రం,కొడిమ్యాల మరియు మల్యాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు,మల్యాల, మేడిపల్లి, మోహన్రావుపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు,
జగిత్యాల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్),జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి,లక్ష్మీపూర్ లోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్,మరియు మేడిపల్లి లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) పాఠశాలలను సందర్శించారు.
ఈ సందర్శనల్లో విద్యా వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు, శుభ్రత, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు మరియుఆదేశాలు జారీ చేశారు.
బాలల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్య అందించడం, పిల్లలకు సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం కల్పించడమే ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశ్యమని కమిషన్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి మరియు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి కే రాజ్ కుమార్ సిడీపీఓలు, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *