తేది:22- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: గురువారం రోజున జగిత్యాల జిల్లా ఐ డి ఓ సి మీటింగ్ హాల్ లో నిర్వహించిన మున్సిపల్ ఆర్వోలు, ఏఆర్ఓలకు నిర్వహించిన ఎలక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఇందులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ మాట్లాడుతూ:
ఆర్వో, ఏఅర్వో లకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు.
ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో ఎన్నికల నిబంధనలు అనుసరించి నిర్వహించాలనే బాధ్యత ఆర్వో, ఏఅర్వో పైన ఉందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల విధులు చాలా కీలకమైనదని, ప్రతీ అంశం పైన క్షుణ్ణం గా అవగాహన కల్పించుకొని విధులను నిర్వర్తించాలన్నారు. ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామాగ్రి సేకరించడం, పూర్తి సామాగ్రి ఉందో లేదో ఎలా సరిచూసుకోవడం, ఓటర్ లిస్ట్, బ్యాలెట్ పేపర్స్ చెక్ చేసుకోవడం, బ్యాలెట్ బాక్స్ ఎలా సీల్ చేయాలి, ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం, PO డైరీ నింపడం, అన్ని ఫార్మ్స్ ఎలా నింపాలి, ఏజెంట్స్ సిగ్నేచర్ ఎక్కడ తీసుకోవాలి, పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బ్యాక్ సీలింగ్, ఓట్స్ కౌంటింగ్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహణ, చైర్మన్, వైస్ చైర్మన్ నియామక పత్రాలు ఇవ్వడం తదితర అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఆర్వో, ఏఅర్వో ల కార్యాచరణ, విధులు, బాధ్యత లు తీసుకోవలిసిన జాగ్రత్త లను పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్స్ వివరించారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు సమన్వయం చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు,
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్,కోరుట్ల మెట్పల్లి ఆర్డీవోలు జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మాస్టర్ ట్రైనర్స్, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.