తేది:20-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: ఈ నెల 21న బుధవారం రోజున మెదక్ పట్టణ ములోని స్థానిక తెలంగాణ నాన్ గజిటెడ్ అసోసియేషన్ భవన్ జిల్లా టీఎన్జీవో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉందని టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఒక్క ప్రకటనలొ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ శ్రీనివాసరావు టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ సయ్యద్ ముజీబ్ హుసేనీలు హాజరవుతారని జిల్లాలోని అన్ని వర్గాల ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ పిలుపునిచ్చారు.