జాతీయ రహదారి 161 పై ముస్లాపూర్ శివారులో అతివేగంతో డివైడర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన.

తేది:17- 01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: అతివేగంతో డివైడర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం ఉదయం ఏడు గంటలకు 161 జాతీయ రహదారి పై ముస్లాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి వయస్సు 29 తండ్రి గోపాల్ రెడ్డి గుర్తించారు. హైదరాబాదులో కెపిహెచ్బి లో ఉంటూ pay tm లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు పండుగ కోసం అని తన స్నేహితుని కారు TS 08KC 3496 ఇంటికి వచ్చి పండగ అయిన తర్వాత తిరిగి ప్రయాణమై హైదరాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అల్లాదుర్గం పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించినట్లు ఏ ఎస్ ఐ గాలయ్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *