అపరిశుభ్రంగా కొండగట్టు కోనేటి జలాలు – భక్తుల ఆవేదన.

తేది:17- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా మల్యాల మండలం రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో కోనేటి జలాలు శనివారం పూర్తిగా అపరిశుభ్రంగా మారాయని భక్తులు ఆరోపించారు. పవిత్ర కోనేటిలో స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుందనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి అంజన్న దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా కోనేటిలో స్నానమాచరించి, అనంతరం స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ క్రమంలో ఇక్కడకు వచ్చే భక్తులు మురికిగా మారిన కోనేటి జలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారక్క జాతరకు ముందు భక్తులు అంజన్నను దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకోవడం ఆనవాయితీ. దీంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *