తేది:17-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS చీఫ్ అడ్వైజర్ ఎర్ర శ్రీహరి గౌడ్.
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సంక్రాంతి ముగ్గు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో సుందరంగా అలంకరించారు.
అవగాహనతో కూడిన ముగ్గులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం, చైనా మాంజా ప్రాణాలకు ముప్పుగా మారుతున్న తీరు, మద్యం సేవించి వాహనాలు నడపరాదనే అంశాలను ప్రతిబింబించే చిత్రాలతో ముగ్గులు రూపొందించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
మహిళా కానిస్టేబుల్ ప్రతిభ తెలుగుదనం ఉట్టిపడేలా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ వనజ ఈ ముగ్గును అందంగా అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయం – సామాజిక బాధ్యతను మేళవించిన విధంగా ముగ్గు రూపొందించారు.
సాంస్కృతిక విలువల ప్రోత్సాహం సంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు, సమాజంలో సాంస్కృతిక విలువలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.