సదాశివపేట మండలంలోని వెల్టూరు గ్రామంలో పబ్బతి నరసింహ రెడ్డి జ్ఞాపకార్థం పబ్బతి రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్మారక క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరైన- TGIIC చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి.

తేది:16-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండల రిపోర్టర్ ఎం ప్రభాకర్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలంలోని వెల్టూరు గ్రామంలో పబ్బతి నరసింహ రెడ్డి జ్ఞాపకార్థం పబ్బతి రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ టోర్నమెంట్ లో వెల్టూరు,ముబారకపూర్ గ్రామాలకు చెందిన జట్లు పోటీపడ్డాయి. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెల్టూరు కు చెందిన కమెండోస్ 11 మరియు రైజింగ్ టైటాన్స్ జట్లు పోటీ పడగా, కమెండోస్ జట్టు విజేతగా నిలిచింది. బహుమతి ప్రదానోత్సవంలో TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి,c.d.c చైర్మన్ రాంరెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, ఇష్రతాబాద్ గ్రామ సర్పంచ్ బలరాం శ్రీనివాస్, వెంకటాపూర్ సర్పంచ్ ఒగ్గు శ్రీనివాస్ మరియు వివిధ గ్రామాల సర్పంచ్ లు నాయకులు పాల్గొన్నారు. నిర్మల జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ధృడత్వానికి తోడ్పడతాయని అన్నారు. ఫైనల్లో విజయం సాధించిన జట్టు కు నిర్వాహకులు ప్రకటించిన 40000 రూపాయలతో పాటు అదనంగా 10000 రూపాయలు బహుమతిగా అందించారు. రన్నర్ అప్ గా నిలిచిన జట్టు కు 20000 రూపాయల ప్రైజ్ మనీ అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *