సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇరు రాష్ట్రాల ఘర్షణ నేపథ్యంలో సాగర్ కు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి.
ఈ రాత్రికి సాగర్ డ్యామ్ ను సీఆర్పీఎఫ్ బలగాలు అధీనంలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే డ్యామ్ కు ఏపీ- తెలంగాణ పోలీసులు ఇరువైపులా భారీగా మోహరించి ఉన్నారు. పోలీస్ వలయంలో నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ డ్యాం కుడి వైపు చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు. కాసేపట్లో ఎడమవైపు కూడా చేరుకోనున్నారు. సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. సాగర్ డ్యామ్ సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రతిపాదనలను అంగీకరించాయి.