న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా,నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు-జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు IPS.

తేది:29-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .

మెదక్ జిల్లా:నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
న్యూ ఇయర్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ కోరారు. ప్రజా భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ద్వారా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *