రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే కదా. రేవంత్ సీఎం అయ్యేది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ కొడంగల్ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.”రేవంత్ సీఎం అవుతాడని ఓట్లేస్తే కొడంగల్ పరిస్థితి మళ్లీ మొదటికే ప్రజలు ఇవన్నీ గమనించాలి. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడిన ఆయన తీరును మీరంతా టీవీల్లో చూశారు. కొడంగల్ సరిపోలేదని. కామారెడ్డిలో నాపై పోటీకి వచ్చారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ చిత్తుగా ఓడించాలి. నేనే సీఎం అనేవాళ్లు కాంగ్రెస్ లో 15 మంది ఉన్నారు.” అని కేసీఆర్ తెలిపారు.