నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం 860 ఎకరాలు కేటాయించింది. తమ్మినపట్నం- మోమిడి గ్రామాల పరిధిలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కిన్నెటా పవర్‌కు ఇచ్చిన భూములను రద్దు చేసిన ఏపీ పరిశ్రమల శాఖ జిందాల్ స్టీల్ లిమిటెడ్‌కు కేటాయించింది. 7500 కోట్లతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్‌ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యక్షంగా 2500 మంది, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. వచ్చే 4 ఏళ్లలో ప్లాంట్ విస్తరణకు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు.