స్పైస్‌జెట్ నుంచి మరో 42 కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు

స్పైస్‌జెట్ నుంచి మరో 42 కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు. జులై 10 నుంచి 30 వరకూ వీటిని లాంచ్ చేయనున్నట్లు అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. సూరత్-జబల్‌పూర్, సూరత్-పూణె రూట్లలోనూ విమాన సర్వీసులు నడిపించనున్నారు.

ఇక ఈ ఎయిర్‌లైన్ నుంచి సూరత్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, గ్వాలియర్, అహ్మదాబాద్, ముంబై, పూణెలను కూడా యాడ్ చేయనున్నారు. ఇందులో నాన్ స్టాప్ సర్వీసులు కూడా చేర్చారు. గ్వాలియర్-అహ్మదాబాద్, గ్వాలియర్-ముంబై, గ్లాలియర్-పూణె రూట్లలో నడుస్తాయి.

కోల్‌కతా-పాట్నా, పాట్నా-సూరత్, సూరత్-పాట్నా, పాట్నా- కోల్‌కతా, అహ్మదాబాద్ – ఉదయ్‌పూర్, బెంగళూరు – కొచ్చి, ఉదయ్‌పూర్ – అహ్మదాబాద్‌లకు నెట్ వర్క్ పెంచనున్నారు.
కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా.. షెడ్యూల్ చేసిన డొమెస్టిక్ విమానాలను మార్చి 25నుంచి మే 24వరకూ రద్దు చేశారు. జూన్ 2020 నుంచి పాక్షికంగా మొదలుపెట్టిన దేశీయ విమాన సర్వీసులు పూర్తి శాతం తిరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభానికి గురైన అన్ని విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ స్పైస్ జెట్ 42కొత్త సర్వీసులు లాంచ్ చేస్తూ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్ లో 14వందల దేశీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *