స్వీడన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేక్‌ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. దీంతో పైలట్ సహా అందులో ఉన్న తొమ్మిది మరణించారు. దేశరాజధాని స్టాక్‌హోమ్‌కు దాదాపు 160 కి.మీ. దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డీహెచ్‌సీ-2 టర్బో బేవర్ అనే స్కైడైవింగ్ విమానం ఒరెబ్రో విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే టేకాఫ్ సమయంలో సాంకేతిక కారణాల వల్ల రన్‌వేకి సమీపంలోనే కుప్పకూలింది. విమానం ముక్కలై పూర్తిగా కాలిపోయింది. దీంతో అందులో ఉన్న 8 మంది స్కై డైవర్లు, ఒక పైలట్ అక్కడికక్కడే మరణించారు.
2019లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. స్కైడైవర్లతో వెళ్తున్న ఓ విమానం యుమీ ఎయిర్‌పోర్టు బయట కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 చనిపోయారు. వాళ్లు కూడా స్కైడైవర్లే కావడం గమనార్హం.