తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించాలని హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కాగా పిల్‌ను లంచ్ మోషన్ అడిగిన అడ్వకేట్ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయని… తాము ఇందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది.