కోర్టులో జరిగే విచారణ వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం చేయడంపై మధ్య ప్రదేశ్ హై కోర్టు నిషేధం విధించింది. కోర్టులో విచారణకు సంబంధించిన లై స్ట్రీమింగ్ వీడియోలను కొందరు ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం చట్టరీత్యా నేరమని.. అలా చేయడానికి ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేస్తూ.. హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ ఫ్లామ్స్ యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్‌లో నియమాలకు వ్యతిరేకంగా ప్రసారం చేస్తున్నారని సోమవారం మధ్య ప్రదేశ్ హై కోర్టులో డాక్టర్ విజయ్ బజాబ్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ – పిల్) పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ చేసిన హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సురేశ్ కుమార్ కెయిట్, జస్టిస్ వివేక్ జైన్ కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియాలు.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంపై నిషేధం విధించారు.
సామాజిక కార్యకర్త అయిన పిటీషనర్ డాక్టర్ విజయ్ బజాజ్ మధ్య ప్రదేశ్ లోని దామోహ్ నగరానికి చెందిన వారు. పిటీషనర్ తరుపున లాయర్ వాదిస్తూ.. “2021లో మధ్య ప్రదేశ్ హై కోర్టు జుడిషియల్ ప్రొసీడింగ్స్‌కు సంబంధించి స్పష్టమైన నియమాలను రూపొందించింది. ఈ నియమాల ప్రకారం.. లైవ్ స్ట్రీమింగ్ వీడియోల కాపిరైట్ హక్కులు పూర్తా హైకోర్టు సొంతం. కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోలను అనువాదం చేయడం, వాటిని ఇతరులకు షేర్ చేయడం లేదా వాటిని ఏదైనా ప్లామ్ ఫామ్ పై అప్‌లోడ్ చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. నియమాలు స్పష్టంగా ఉన్నా.. కేవలం డబ్బు సంపాదించడానికి కోర్టు లైవ్ స్ట్రీమ్ వీడియోల ఎడిట్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేయడంపై నిషేధం విధించాలి. ఇప్పటికే ఈ వీడియోల ద్వారా సంపాదించిన డబ్బుని వారి నుంచి వసూలు చేయాలి. ప్లాట్ ఫాం నుంచి వీడియోలు కూడా తొలగించాలి.” అని చెప్పారు.
పిటీషనర్ వాదనలు విన్న తరువాత హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సానుకూలంగా స్పందిస్తూ.. “టెలివిజన్ లేదా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కోర్టు లైవ్ స్ట్రీమ్ వీడియోలు ప్రసారం చేయాలంటే ముందుగా కోర్టు వద్ద అనుమతులు తీసుకోవాలి. అలా చేయకుండా సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేయడం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసినట్లే. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఇతర ప్లాట్ ఫామ్స్ లో మీమ్స్, రీల్స్, షార్ట్స్ అంటూ కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. ఇలా చేయడం నిలయమాలను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేస్తున్నాం.” అని వ్యాఖ్యానించింది.
సోషల్ మీడియాలో కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు అప్ లోడ్ చేయడంపై మినిస్ట్రీ, బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ, యూట్యూబ్, ట్విట్టర్ ఎక్స్, మెటా (ఫేస్ బుక్) సంస్థలకు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై స్పందించడానికి నాలుగు వారాలు గడువు విధించింది.
మరోవైపు వారం రోజుల క్రితం అక్టోబర్ 28న కోల్ కతా హై కోర్టులో జూమ్ వర్చువల్ హియరింగ్ మాధ్యమంలో విచారణ జరుగుతుండగా.. అనూహ్యంగా పార్న్ వీడియోలు, న్యూడ్ ఫొటోలు ప్రసారమయ్యాయి. దీనిపై కోర్టులో వర్చువల్ హియరింగ్ ప్రసారం చేసే ఏజెన్సీపై సమీప పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.