సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వతంత్ర సమరయోధుల ఆశయాల సాధనకై రిలే నిరాహార దీక్ష చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వాతంత్ర సమరయోధుల ఆశాల సాధనకై, రిలే నిరాహార దీక్ష చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, సంగారెడ్డి జిల్లా పి.ఎస్.ఎస్.ఎమ్ అధ్యక్షులు పి సంగమేశ్వర్,యువజన సంఘం నాయకులు వడ్ల శ్రీకాంత్ మరియు ఫ్రీడమ్ ఫైటర్ల ఆశయాల సాధనకై పోరాడే సభ్యులు వివిధ ప్రజా సంఘాల సభ్యులు. ఈ తరుణంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ కాంటస్తేడ్ ఎమ్మెల్యే.ఎంపీ మాట్లాడుతూ స్వతంత్రము సాధించుకొని 75 ఏళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో గత పది ఏళ్ల నుండి ప్రభుత్వ యంత్రాంగంలో రోజురోజుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం పెరిగిపోతుందని ఇట్టి విషయంలో త్వరలోనే ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళన కొనసాగిస్తామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ అహర్నిశలు పనిచేస్తుందని రిలే నిరాహార దీక్ష సందర్భంగా ఒక ప్రకటనలో తెలియజేస్తూ ముందు ముందు తెలంగాణ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు రిలే నిరాహార దీక్షను పరిగణలోకి తీసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడి స్వతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ గారికి కేటాయించిన 10 పది ఎకరాల పట్టా సర్టిఫికెట్ ను ధరణిలో చేర్చి పట్టా పాస్ బుక్కులు మంజూరు చేసి ఫ్రీడమ్ ఫైటర్ ఆశయాల సాధనకై పిరమిడ్ ఆకృతిలో క్షేత్ర నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఈరోజు రిలే నిరాహార దీక్షలో చేపట్టిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా ఇట్టి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న నిర్లక్ష్యాన్ని రూపుమాపేందుకు ఢిల్లీలో నవంబర్ 10,11న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో ఎం మల్లేశం, పెండ్యాల రవికుమార్ మరియు వివిధ ప్రజాక్షేత్ర సంఘాలు పాల్గొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *