సంగారెడ్డి జిల్లా, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఏ.సత్తయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించిన బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల విలువలను గుర్తించి వారి యొక్క ఆశయాల కోసం, సాధన కోసం స్వాతంత్ర సమరయోధుల యొక్క బాటలో నడవడం ఎంతో ఆనందదాయకమని సంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఏ సత్తయ్య గారు కొనియాడారని తెలియజేశారు. ఈ సందర్భంలో స్వతంత్ర సమరయోధుల కోసం వేసే ప్రతి అడుగులో తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా, అవినీతిని అంతం చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నవంబర్ 10, 11న సత్యమేవ జయతే మహా ధ్యాన ధర్నా నిర్వహించి తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందించే విధంగా గొప్ప పేరు తీసుకొస్తామని, తెలంగాణ ప్రజానీకానికి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో పి సంగమేశ్వర్ గారు పాల్గొన్నారు.