ఏంటయ్యా బుచ్చిబాబు.. ఏం ప్లాన్ చేశావయ్య..!

టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. త్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో ఓ సినిమా చేస్తున్నాడు. RC16 తో సినిమా షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నారు.. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటి మెగా అభిమానుల్లో పెరిగిపోయింది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. తమ హీరో ఎలా కనిపిస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. RC16 మూవీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ మల్ల యోధుడి జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఆ మల్ల యోధుడి పేరు కోడి రామ్మూర్తి నాయుడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం అనే గ్రామంలో 1882 పుట్టిన రామ్మూర్తి నాయుడు కుస్తీ పోటీల్లో తిరుగులేని ఆటగాడిగా పేరొందాడు. ఇతడి గురించి ఆంధ్రా ప్రజలు కథలు, కథలుగా చెప్పుకొంటారు.. ఈయన గురించి పెద్ద చరిత్రే ఉంది.

 

Ram Charan Buchi Babu movie story leak.. Movie with sports story

Ram Charan Buchi Babu movie story leak.. Movie with sports story

ఈ కోడి రామ్మూర్తి నాయుడు అప్పట్లోనే ఒళ్లుగగుర్పొడిచే విన్యాసాలు చేసేవాడని పేరేన్నికగన్నాడు. ఇక కుస్తీ పోటీల్లో అతడికి తిరుగులేదు. ఎంతటి వాడినైనా మట్టి కలిపేసే వాడట.. ఆయన స్పీడ్ గా వచ్చే రెండు కార్లను ఒకేసారి తన రెండు చేతులతో ఆపేవాడని, ఆయన ఛాతిపై నాపరాళ్లను పెట్టుకుంటే.. వాటిపైనుంచి ఏనుగులు నడిచివెళ్లేవని చరిత్రలో ఎన్నో కథలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఒంటిచేత్తో రైలు ఇంజన్ ను రామ్మూర్తి నాయుడు ఆపినట్లు చెబుతుంటారు. బుల్ ఫైట్ లోనూ అతడు పాల్గొన్నట్లుగా చరిత్ర చెబుతోంది. కాగా.. ఈయన ఓ సర్కస్ కంపెనీని కూడా నడిపించాడట. మల్ల మార్తాండ, కలియుగ భీమ, వీర కంఠీవ లాంటి బిరుదులు ఆయనకు ఉన్నాయి.

 

ఈ సినిమాలో రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కించే విషయం నిజం అయితే.. ఏ రేంజ్ లో సినిమా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో ఆయన నటిస్తున్నారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్రిపుల్ ఆర్ ను మించిన సన్నివేశాలు ఉంటాయని ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరాలు మొదలు పెట్టారు. అయితే పూర్తిగా ఆయన జీవితాన్నే తెరకెక్కిస్తున్నారా? లేక.. హీరో పాత్ర కోసమే ఆయన లైఫ్ ను ఆధారంగా తీసుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో పాత్ర కోసం బాడీని బిల్డ్ చేయడానికి చెర్రీ ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే రామ్ చరణ్ కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *