కేరళలో నిఫా వైరస్ విజృంభణ..!

కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. తొలిసారిగా ఈ మహమ్మారి 2018లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఈ వైరస్ కారణంగా దాదాపు 17మంది మృతి చెెందాారు. గతేడాది కూడా ఇద్దరిని బలితీసుకుంది. తాజాగా, ఈ వైరస్ కారణంగా ఓ 24ఏళ్ల యువకుడు మృతి చెెందాాడు. దీంతో భారత వైద్య పరిశోధనా మండలి హెచ్చరించడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. గతంలో జరిగిన పరిణామాలకు అనుగుణంగా కట్టడి చర్యలు తీసుకునేందుకు కట్టుదిట్టం చేసింది.

 

వివరాల ప్రకారం.. మలప్పురంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మృతుడితో కాంటాక్ట్ ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితుల వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య, రెవెన్యూశాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. నిఫా వైరస్ ప్రబలుతున్న తరుణంలో అధికారులు ఆంక్షలు విధించారు.

 

ఇక, నిఫా వైరస్ విషయానికొస్తే.. ఇది జూనోటిక్ వైరస్. ప్రధానంగా పందులు, గబ్బిలాలు వంటి జంతువులు నుంచి మానవులకు వ్యాపిస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా ఒకరి నుంచి మరోకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందని అధికారులు చెబుతున్నారు. వైరస్ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పులు, కండరాల నొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. దీంతో పాటు మైకము, మగత, మార్పు చెందిన స్పృహ, తీవ్రమైన ఎన్సెపాలిటిస్‌ను సూచించే నరాల సంకేతాలు ఉంటాయి. కాగా, నిఫా మరణాల రేటు 40 నుంచి 75శాతం వరకు ఉందని అంచనా వేస్తున్నారు.

 

నిఫా వైరస్ కారణంగా ఓ యువకుడు చనిపోవడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు 16 కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వైరస్ కట్టడి చర్యలు తీసుకుంటుంది. అయితే అంతకుముందు ఆ యువకుడికి లక్షణాలు కనిపించడంతో పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చాడు. వెంటనే ఆ యువకుడికి పరీక్షలు జరపగా.. పాజిటివ్ తేలింది.

 

అయితే, ఆ యువకుడు ఆస్పత్రిలో అడ్మిట్ కాకముందు కుటుంబసభ్యులతోపాటు మిత్రులతో కలిసి పలు వేడుకల్లో పాల్గొనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 151 మందితో ఆ యువకుడు కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. అయితే చికిత్స కోసం మూడు నుంచి నాలుగు ఆస్పత్రులను సంప్రదించినట్లు సమాచారం.

 

అయితే, అనుమానితుల్లో కొంతమందికి నిఫా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అందరి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు.

 

ఇదిలా ఉండగా, గత జులైలో మళప్పురం పరిధిలోనే 14 ఏళ్ల బాలుడు నిఫాతోనే మృతి చెందగా.. తాజాగా, అదే ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడు చనిపోవడంతో రెండు నెలల్లో ఇప్పటివరకు నిఫాతో చనిపోయిన వారి సంఖ్య ఇద్దరికి చేరినట్లు తెలిపారు. అయితే ఈ వైరస్ ప్రమాదకర వైరస్‌ల జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *