ఏపీలో ఒక్కరోజే 100 అన్న క్యాంటీన్లు పున:ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు పున:ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గుడివాడలో సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం పేదలతో కలిసి చంద్రబాబు భోజనం చేశారు. అన్న క్యాంటీన్లలో రూ.5కే బ్రేక్ ఫాస్ట్‌తో పాటు లంచ్, డిన్నర్ అందించనున్నారు.

 

గుడివాడకు టీడీపీ రుణపడి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. గుడివాడలో మూడు అన్న క్యాంటీన్లను పెడుతున్నామని, ఎన్టీఆర్ మొదటిసారి గెలిచిన నియోజకవర్గమని, సీఎంగా ప్రమానస్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వెళ్లిన ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వంలో కోల్పోయిన అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించామన్నారు. పేదలకు కడుపు నిండా భోజనం అందితే సంతోషంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.

 

అన్న క్యాంటీన్లలో టిఫిన్ ఉదయం 7 గంటల నుంచి10 గంటల వరకు, మధ్యాహ్నం లంచ్ 12.30 గంటల నుంచి 3గంటల వరకు, రాత్రి భోజనం 7.30 నుంచి 9గంటల వరకు అందుబాటులో ఉంటుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. రేపు మరో 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తారు. తొలి విడతలో మొత్తం 17 జిల్లాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. సెప్టెంబర్ 5 కల్లా మిగిలిన మరో 103 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

 

అన్న క్యాంటీన్లను మూసివేయవద్దని గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం పెట్టకపోయినా దాతలు నిర్వహిస్తారని, కనీసం వారికైనా అవకాశం ఇవ్వాలని చెప్పినా వినలేదన్నారు. అయితే చివరికి మీ పేరు పెట్టుకొని అన్నం పెట్టాలని కోరామని, అన్న క్యాంటీన్ల వద్ద రూ.5కే భోజనం పెడుతుంటే అడ్డుకున్నారన్నారు.

 

పేద ప్రజలకు భోజనం పెట్టడం అందరి బాధ్యత అని, ఇందుకు హరేకృష్ణ ఛారటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషమన్నారు. తక్కువ వేతనంతో నివసిస్తున్న ప్రజలకు అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగపడతాయన్నారు. అందరం బతికేది పొట్ట కోసమేనని, కడుడపు నిండా భోజనం అందించాలన్నారు.

 

మరోవైపు ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మను అంతరూ గుర్తుపెట్టుకున్నామన్నారు. ఆమె గోదావరి నుంచి వచ్చే వాళ్లకు అన్నం పెట్టేదన్నారు. కాగా, పేదరికం లేని సమాజం కావాలన్నదే నా కల అని చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *