ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ (HONOR) చైనాలో కొత్త HONOR 700 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో HONOR 700S, HONOR 700, HONOR 700 Pro పేర్లతో మూడు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో 9000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, 120Hz OLED డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ వెనుక భాగంలో 1.59 అంగుళాల ప్రత్యేక డైనమిక్ డిస్ప్లేను అందించడం విశేషం.
HONOR 700 సిరీస్‌లో బేస్ మోడల్ అయిన 700Sలో 6.57 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. వెనుక భాగంలో 1.59 అంగుళాల AMOLED డైనమిక్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ 12GB RAM, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే HONOR 700Sలో OIS సపోర్ట్‌తో కూడిన 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 9000mAh భారీ బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు. అంతేకాకుండా IP68, IP69, IP69K రేటింగ్స్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను అందించారు.