సిద్దిపేట జిల్లాలో భారీ భహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను సీఎం చేసారు. దాదాపుగా సిద్దిపేట జిల్లాలో రూ.544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. దీంతో పాటుగా ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తు ఫారం విడుదల చేసారు.
సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని అన్నారు. నుంచి సిద్దిపేట గడ్డ.. కాంగ్రెస్ అడ్డా అని కార్యకర్తలు నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలకమైన మదన్మోహన్ను అందరం స్మరించుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. సిద్దిపేట గడ్డ నుంచే ఆయన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటారని సీఎం గేర్తు చేశారు.
వాడు పోతే వీడు.. వీడు పోతే వాడు.. అంటూ ఛత్రపతి సినిమా డైలాగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లాలో గత నాలుగు దశాబ్దాలుగా కుటుంబ వారసత్వ రాజకీయాలు సాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మామ పోతే అల్లుడు, అల్లుడు పోతే బావమరిది అంటూ పదవులు పంచుకుంటున్నారని మండిపడ్డారు. ఇకపై అలాంటి ఆటలు ఈ గడ్డపై సాగవని, సిద్దిపేట కాంగ్రెస్ అడ్డాగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ నాడు తెలంగాణ కోసం 1200 మంది అమరుల త్యాగాలపై అధికారం చెలాయించిన పాపం ఊరికే పోదని కేసీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మీరు పాలించిన పదేళ్లలో అమరవీరుల తల్లికి ఏ పదవీ ఇవ్వలేదని సీఎం రేవంత్ విమర్శిస్తూ తమ ప్రభుత్వంలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మహిళా కమిషన్ సభ్యత్వం ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రానున్న ఎలక్షన్లలో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేయండి మీకు మంత్రి పదవిచ్చే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్ది అన్నారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచిన వారికి మంత్రి పదవి ఇచ్చే బాధ్యత తనదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
హరీశ్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. గతంలో కలిసి రాజకీయాలు మొదలుపెట్టిన జగ్గారెడ్డి అప్పుల్లో కూరుకుపోగా.. సోలిపేట రామలింగారెడ్డి చితికిపోయారని, మరి హరీశ్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజాయితీపరుడైన చెరుకు ముత్యంరెడ్డి త్యాగాలను గుర్తుచేస్తూ నేటి పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలన్నారు. ఇకనైనా ప్రజలు అర్థం చేసుకుని జిల్లాలో అభివృద్దికి ప్రజలందరూ సహకరించాలని అన్నారు.
సభలో మాట్లాడుతూ.. KCRపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యూత్ కాంగ్రెస్‌లో తొలి అవకాశం ఇచ్చిన మదన్ మోహన్‌పైనే KCR పోటీ చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆనాడు నమ్మిన వారిని మోసం చేయడం కేసీఆర్ రక్తంలోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వెల్లాక ఐనవారిని మరిచిపోయి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.