సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కార్పొరేషన్ పీఠం దక్కించుకోవాలని ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది వైసీపీ. టీడీపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మిదేవిని వైసీపీలోకి రప్పించిన ధర్మాన ప్రసాదరావు, ఆమెని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టారు. గెలుపుకోసం తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
శ్రీకాకుళం సిటీలో గుండ లక్ష్మిదేవి కాస్త మంచి పేరు ఉంది. ఆమెని తమ వైపు తిప్పుకుని సక్సెస్ సాధించారు వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు. ఆమెని మేయర్ అభ్యర్థిగా నిలిబెట్టించారు. ఆమె గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నార్మల్‌గా అక్కడ టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే ఓడించడం చాలా కష్టం. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లింది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకుని పావులు కదిపారు ధర్మాన ప్రసాదరావు.
బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు శ్రీకాకుళం కార్పొరేషన్ వైసీపీ మేయర్ అభ్యర్ధి గుండ లక్ష్మిదేవి. తనకు ప్రజలు మద్దతు ఉందని, ఆ అభిమానంతో నన్ను గెలిపిస్తారని ధీమాగా చెబుతున్నారు. టీడీపీ నుండి వైసీపీకి మారి మంచి పని చేశానని ప్రజలు అంటున్నారని వివరించారు. పదవులను ఆశించి ఎప్పుడు పని చేయలేదని, నా జీవితంలో ఎన్నో ఏళ్లు ప్రజా ప్రదినిధిగా పని చేశాను అన్నారు. అభివృద్ధి చేయడానికి శ్రీకాకుళం మున్సిపాలిటిని.. కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ చేశామన్నారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా నా భర్త అప్పల సూర్య నారాయణ పని చేశారని, సిటీలో ఆయన విగ్రహం పెట్టడానికి టీడీపీ నేతలు రాద్దాంతం చేశారని దుయ్యబట్టారు. విగ్రహం కట్టడానికి నిర్మించిన దిమ్మెలను కూల గొట్టించారని ఆరోపించారు. ఎన్నికల ముందు హఠాత్తుగా విగ్రహం పెట్టించారని మండిపడ్డారు. అంతా ప్రేమ ఉంటే సెవన్ రోడ్ జంక్షన్లో విగ్రహం పెట్టాలని, అక్కడ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నా మీద నిందలు వేసి ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ నేతలు ఇలాంటి పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా చాలామంది పోటీ పడ్డారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లింది. దీంతో చాలామంది టీడీపీ నేతలు డీలా పడ్డారు. ఈ క్రమంలో ఆయా నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ధర్మాన తన వ్యూహాన్ని అమలు చేశారు. రాత్రి వేళ అభ్యర్థులపై సిటీకి బయట మంతనాలు సాగిస్తున్టన్లు వార్తలు ఉన్నాయి. టీడీపీలో ఉంటూనే తమకు సహాయం చేయాలని వారిని కోరినట్టు స్థానికుల్లో చర్చ జరుగుతోంది.
జనసేన పార్టీకి అక్కడ పెద్దగా బలం లేదు. కేవలం కాపు ఓటు బ్యాంకు, టీడీపీపై ఆధారపడింది. ఆ పార్టీ తరపున బలమైన నేతలు ప్రచారం చేసిన సందర్భం లేదు. ఈ క్రమంలో గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు. డాక్టర్ పని చేసిన రాధా రాణి, ప్రజలకు సుపరిచితురాలని అంటున్నారు. అక్కడ టీడీపీ గట్టిగా పని చేస్తేనే జనసేన విజయం సొంతం అవుతుందని, లేకుంటే కష్టమని వాదన వినిపిస్తోంది.