సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేదిక ఫిక్స్..? అమ్మాయి ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్స్ గా కొనసాగుతున్న నటుడు తేజ సజ్జ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆయన ఈ వార్తలపై స్పందిస్తూ తాను పెళ్లి చేసుకోబోతున్నానని క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా మరొక హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సైతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే...

సాయి తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఈయన కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని తెలుస్తోంది. తాజాగా ఈయన ఎంగేజ్మెంట్(Engagment) పెళ్లికి (Wedding)సంబంధించి వార్తలు మెగా కాంపౌండ్ నుంచి లీక్ అయ్యాయని సమాచారం. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకనుగుణంగా సాయి ధరంతేజ్ నవంబర్ 5వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థపు వేడుక పూర్తిగా ప్రవేట్ ఈవెంట్ లాగే జరగబోతుందని సమాచారం.

ఇలా నవంబర్ లో నిశ్చితార్థం జరుపుకుంటున్న సాయితేజ్ డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే అందరూ అనుకున్నట్టు సాయి తేజ్ వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ కాదని ఈయన హైదరాబాద్లోనే తన వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన వేదిక కూడ ఫైనల్ అయిందని త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలను అధికారకంగా తెలియచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా సాయి దుర్గా తేజ్ పెళ్లికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఇక సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం పెళ్లికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి కానీ అమ్మాయి వివరాలను మాత్రం ఇప్పటివరకు ఎక్కడ వెల్లడించలేదు. అయితే తన వివాహం మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. గతంలో సాయి దుర్గ తేజ్ తన లవ్ స్టోరీ గురించి కూడా తెలిపారు. తన లవ్ బ్రేకప్ అయ్యిందని, లవ్ బ్రేకప్ కావడంతో సాయి తేజ్ పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ పెళ్లి వార్తలపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాలి అంటే మెగా ఫ్యామిలీ అధికారకంగా ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.ఇక సాయి తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన సంబరాల ఏటిగట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చిత్ర బృందం తెలియజేశారు. మరి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.