మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకుంటూ యువత ముందడుగు వేయాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. నానక్రామ్గూడలోని షెరటాన్ హోటల్లో సోమవారం జరిగిన ‘క్యాంపస్ హబ్ AI’ ప్రొడక్ట్ లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు కలిసి క్యాంపస్ హబ్ఏఐని ప్రారంభించడం ఎంతో అభినందనీయమని, నేటి సమాజానికి ఇలాంటి యువతే ఆదర్శమని పేర్కొన్నారు. యువత ఆలోచనలు గొప్పగా ఉండాలని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదగాలని ఆకాంక్షించారు. గతంలో తెలంగాణలో ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోందని తెలిపారు. ల్యాండ్లైన్ల నుంచి స్మార్ట్ఫోన్ల వరకు టెక్నాలజీ ఎంతో వేగంగా మారింది. రాబోయే కాలమంతా ఏఐదే కీలక పాత్ర అని, ఇప్పటికే డ్రైవర్లెస్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఒక దూతం లాంటిదని, విద్యావ్యవస్థలోనూ టెక్నాలజీ ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. గతంలోనే వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ‘ పేరిట సిరిసిల్లలోని ఒక గ్రామంలో AI ఆధారిత ప్రాజెక్టును చేపట్టి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు.
ఐటీ కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ ఒక్కటే కేంద్రంగా ఉండాల్సిన అవసరం లేదని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. పరకాలలో రాకేష్ అనే యువకుడు ఐటీ కంపెనీ నెలకొల్పడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం కూడా ఏఐ సాంకేతికతను ప్రోత్సహించాలని, అదే సమయంలో దీనిని దుర్వినియోగం చేయకుండా అవసరమైన చోటే ఉపయోగించాలని కోరారు.అధికారంలోకి వచ్చాక ఏఐకి ప్రాధాన్యం:** రెండేళ్ల తర్వాత కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రభుత్వ శాఖలకు ఏఐ ని అనుసంధానం చేస్తామని, ప్రతి రంగంలోనూ దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు.