ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో రాకా సినిమా(Raaka) షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే అల్లు అర్జున్ తన 23వ సినిమా అని ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kangaraj) దర్శకత్వంలో చేయబోతున్న విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఇలా ఈ సినిమా ప్రకటించినప్పటికీ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత రెండు రోజులుగా అల్లు అర్జున్ లోకేష్ సినిమా రద్దయింది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ సినిమా సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ అల్లు అర్జున్ కు పెద్దగా నచ్చకపోవడంతో స్క్రిప్ట్ సరి చేయమని సూచనలు వచ్చాయి అని కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈ సినిమా షూటింగు గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెలియజేశారు. లోకేష్ తో పాటు అల్లు అర్జున్ మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతున్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ ఫోటోని షేర్ చేసిన లోకేష్ కనగరాజ్ త్వరలోనే బిగ్ అప్డేట్ రాబోతుందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్నటువంటి వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. మరోవైపు మైత్రి నిర్మాతలు సైతం ఈ సినిమా పూజ ముహూర్తానికి సమయం ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతోందని సమాచారం. మరి ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే ఇవ్వబోతున్నారా లేదా మరేదైనా అప్డేట్ ఉండబోతుందా అంటూ అభిమానులు ఆత్రుత కనబరుస్తున్నారు.