త్రివిక్రమ్ గడ్డం వెనుక సీక్రెట్ ఇదేనా..!

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. డైలాగ్ రైటర్ గా ,సినీ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు దర్శకుడిగా కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47(Aadarshakutumbam House No.47) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ యాంకర్ సుమతో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా వీరి వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి సుమ సరదాగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే సుమ త్రివిక్రమ్ గారితో మాట్లాడుతూ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా సింహం మాత్రమే కాదు త్రివిక్రమ్ కూడా గడ్డం గీసుకోరు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని ఎప్పుడు చూసినా ఆయన గడ్డంతోనే కనిపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే సుమ కూడా ఈ ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు త్రివిక్రమ్ సమాధానం చెబుతూ పెళ్లయిన కొత్తలో నా భార్య కూడా గడ్డం లేకుండా చూశారు అప్పటినుంచి తాను ఇలా గడ్డంతోనే ఉన్నానని తెలిపారు. నేను గడ్డం తీసేస్తే బహుశా నన్ను ఎవరు గుర్తుపట్టరేమో అందుకే తీయట్లేదు అని చెబుతూనే తన ఆధార్ కార్డ్ ,పాస్ పోర్ట్ అన్నింటిలో కూడా తన ఫోటో గడ్డంతోనే ఉందని, గడ్డం తీసేస్తే ఇమిగ్రేషన్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకే తాను ఎప్పుడూ ఇలాగే గడ్డంతోనే ఉంటాను అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. ఇలా తన గడ్డం వెనుక సీక్రెట్ తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఆదర్శ కుటుంబం సినిమా విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ నటించిన సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశారు. అనంతరం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలకు కథ రచయితగా పనిచేశారు. ఇలా వెంకటేష్ సినిమాల కోసం త్రివిక్రమ్ పనిచేసినప్పటికీ మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయని ఇటీవల విడుదల చేసిన ఒక టీజర్ వీడియో చూస్తేనే స్పష్టం అవుతుంది. మొదటిసారి త్రివిక్రమ్ వెంకీ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదర్శ కుటుంబం ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది తెలియాల్సి ఉంది..