టిబెట్ ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. తాజాగా భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది.
ఇటీవల టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారీ జలప్రళయం, వరదలు సంభవించడంతో ఆయా ప్రాంతాలు ఇంకా సాధారణ పరిస్థితులకు పూర్తిగా చేరుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా భూకంపం సంభవించడంతో స్థానికుల్లో మరింత ఆందోళన నెలకొంది.
భూకంపం కారణంగా జరిగిన నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.