SBI ఖాతాదారులకు అలర్ట్.. 45 నిమిషాలు నిలిచిపోనున్న UPI సేవలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్యమైన ప్రకటన చేసింది. సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా సెప్టెంబర్ 4వ తేదీ అర్థరాత్రి SBI ఖాతా ఆధారిత UPI సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో ఖాతాదారులు UPI లావాదేవీలు నిర్వహించలేరు.

సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 12:15 గంటల నుంచి 1 గంట వరకు మొత్తం 45 నిమిషాల పాటు SBI అకౌంట్ ఆధారిత UPI సేవలు అందుబాటులో ఉండవు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి UPI యాప్‌ల ద్వారా SBI ఖాతా నుంచి చేసే లావాదేవీలపై కూడా ఈ అంతరాయం ప్రభావం చూపనుంది.

షెడ్యూల్ చేసిన సాంకేతిక నిర్వహణ పనులను పూర్తి చేయడంలో భాగంగానే ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని SBI వెల్లడించింది. ఈ సమయంలో అత్యవసర UPI లావాదేవీలు చేయాల్సిన ఖాతాదారులు ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.