కర్నూలులో ప్యానల్ లాయర్ల విధులపై రివ్యూ మీటింగ్

కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్యానల్ లాయర్ల విధులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి సూచనల మేరకు మొదటి అదనపు జిల్లా జడ్జి పి. కమలాదేవి, సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి బి. లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో కర్నూలు కోర్టు కాంపౌండ్‌లోని న్యాయ సేవా సదన్‌లో ఈ సమావేశం హైబ్రిడ్ మోడ్‌లో జరిగింది.

ఈ సందర్భంగా ప్యానల్ లాయర్ల విధులు, చట్టపరమైన సలహాలు, కేసుల వివరాలు, పరిష్కార ప్రక్రియ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ కేసుల ప్రస్తుత స్థితిగతులను అధికారులు తెలుసుకున్నారు. కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా న్యాయవాదులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచనతో పాటు ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయ సేవలు అవసరమైన వారికి సకాలంలో న్యాయ సహాయం అందేలా సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.