సినిమా ప్రియులను అలరించేందుకు ప్రతి వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పోటీపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త సినిమాలపై భారీ అంచనాలు నెలకొనడంతో బాక్సాఫీస్ వద్ద కూడా సందడి కొనసాగుతోంది.
గతవారం విడుదలైన ‘ఇరుముడి’ వంటి సినిమాలు థియేటర్లలో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తున్నాయి. దీంతో థియేటర్లలో ప్రేక్షకుల సందడి కొనసాగుతోంది. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇదే జోష్‌తో ఈ వారం కూడా థియేటర్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థియేటర్లలో భారీ చిత్రాలతో పాటు ఓటీటీల్లో విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. దీంతో ఈ వారం సినీ ప్రియులకు ఎంటర్టైన్మెంట్కు కొదవ ఉండదని చెప్పొచ్చు.