ఏపీఎస్‌ఆర్టీసీని మరింత బలోపేతం చేయాలి: మంత్రి మండిపల్లి

రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఏపీఎస్‌ఆర్టీసీ నూతన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ సోమవారం అమరావతి అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రిని కలిశారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎం. శివప్రసాద్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. తన పదవీకాలంలో సంస్థ అభివృద్ధికి సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

ఏపీఎస్‌ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తూ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవల నాణ్యతను మరింత పెంచాలని ఆయన పేర్కొన్నారు.