గొల్లపల్లిలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం

లక్కీరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం గొల్లపల్లిలో మండల టీడీపీ అధ్యక్షుడు యనమల మదన్‌మోహన్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను కరపత్రాల ద్వారా వివరించారు.

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న యనమల మదన్‌మోహన్, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా డోర్ టు డోర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.