Nikita Rawal: అభిమాని ఊహించని విధంగా లిప్ కిస్.. పబ్లిక్ ఈవెంట్‌లో నటి షాక్!

సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు అభిమానుల నుంచి లభించే ప్రేమ, అభిమానం కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ నికితా రావల్‌కు ఓ పబ్లిక్ ఈవెంట్‌లో అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. నికితాను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు కార్యక్రమానికి తరలివచ్చారు. స్టేజ్‌పైకి వచ్చిన ఆమె చిరునవ్వుతో అభిమానులను పలకరిస్తూ సందడి చేశారు.

అభిమానుల కోరిక మేరకు నికితా రావల్ ఓపికగా వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. అయితే ఫొటోలు దిగుతున్న సమయంలో ఓ అభిమాని ఊహించని విధంగా ఆమెకు దగ్గరగా వచ్చి లిప్ కిస్ ఇవ్వడంతో నటి ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు సమాచారం. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.

అభిమానులతో ఫొటోలు దిగడం, వారిని కలవడం సెలబ్రిటీలకు సాధారణమే అయినప్పటికీ.. వ్యక్తిగత హద్దులను గౌరవించడం కూడా అంతే ముఖ్యమనే చర్చ ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చింది. నికితా రావల్‌కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారినట్లు తెలుస్తోంది.