‘ది ప్యారడైజ్’ టీజర్‌తో అంచనాలు డబుల్.. ఊర మాస్ లుక్‌లో నాని అదుర్స్

టాలీవుడ్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ **’ది ప్యారడైజ్’**పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, చార్ట్‌బస్టర్ సాంగ్ ‘ఆయా షేర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై భారీ బజ్‌ను సృష్టించాయి.

ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘ది ప్యారడైజ్’ టీజర్ అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేసింది. టీజర్‌లో నాని ఇప్పటివరకు కనిపించని సరికొత్త రా అండ్ ఊర మాస్ అవతార్‌లో కనిపిస్తూ తన లుక్, యాక్షన్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. పవర్‌ఫుల్ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి తనదైన మాస్ టేకింగ్‌ను చూపించగా, నాని కెరీర్‌లోనే భిన్నమైన పాత్రలో కనిపించనున్నారనే సంకేతాలు టీజర్ ఇచ్చింది. దీంతో ఈ పాన్ ఇండియా సినిమాపై అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.