కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన రైతు హనుమండ్ల బాలయ్య (65) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన తండ్రి పేరు కనుకయ్య.
బుధవారం మధ్యాహ్నం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్‌లోని ఎస్‌బీఐ బ్యాంకుకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన బాలయ్య, నగదు డ్రా చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై బ్యాంకులోనే కుప్పకూలిపోయారు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.