ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్..? ఎట్టకేలకు నోరు విప్పిన అనుపమ..!

అనుపమ పరమేశ్వరన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరి మధ్య దూరం పెరగడంతో బ్రేకప్ కూడా జరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఎక్కడ చూసినా అదే చర్చ నడవడంతో అభిమానులు కూడా నిజంగానే ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా అంటూ ఆసక్తిగా ఆరాలు తీశారు కూడా.

 

తన జీవితంలో గత ఏడాది చాలా కష్టంగా గడిచిందని అనుపమ చెప్పింది. మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కానీ ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని ప్రశాంతమైన జీవితంలోకి అడుగుపెడుతున్నానని తెలిపింది. “ఏ పరిస్థితుల్లోనైనా ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన సంతోషం మన చేతుల్లోనే ఉంటుంది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్” అని చెప్పింది.

 

ఎక్కడా ధ్రువ్ విక్రమ్ పేరు చెప్పని అనుపమ

 

అనుపమ తన కామెంట్స్‌లో ఎక్కడా ధ్రువ్ విక్రమ్ పేరు చెప్పలేదు. అలాగే ప్రేమ, బ్రేకప్ గురించి కూడా మాట్లాడలేదు. కానీ ఆమె చెప్పిన మాటలతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్టే అయిందని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.

 

ఎందుకంటే కొంతకాలంగా అనుపమ, ధ్రువ్ విక్రమ్ కలిసి కనిపించడం, ఇద్దరూ ఒకేలా పోస్టులు పెట్టడం, కొన్ని సందర్భాల్లో ఒకే లొకేషన్లలో ఉన్నట్లు నెటిజన్లు గుర్తించడం వల్లే ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత ఇద్దరూ సోషల్ మీడియాలో దూరంగా ఉండటంతో బ్రేకప్ జరిగిపోయిందనే వార్తలు మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.అయితే ఈ వార్తలపై ఎవరూ ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం గమనార్హం.

 

ఇదిలా ఉంటే అనుపమ ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. గతంలో ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో లిల్లీ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమ.అంతకుముందు’ఈగల్’ సినిమాలో రవితేజ సరసన నటించిన అను ‘కార్తికేయ 2’పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు సంపాదించింది. అలాగే ’18 పేజెస్’, ‘రాక్షసుడు’, హలో గురు ప్రేమ కోసమే’, ‘శతమానం భవతి,’ప్రేమమ్’లాంటి సినిమాలు ఆమె కెరీర్‌లో మంచి హిట్లుగా నిలిచాయి.

 

కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యం

 

తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనుపమ… వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్ల కంటే తన కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరిగినా వాటిపై పెద్దగా స్పందించకుండా తన పనితోనే సమాధానం చెబుతోంది.

 

ప్రస్తుతం ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ చూసిన అభిమానులు… “గతాన్ని మర్చిపోయి ఇలాగే హ్యాపీగా ఉండాలి” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ధ్రువ్ విక్రమ్‌తో ప్రేమ, బ్రేకప్ వార్తలపై ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా, అనుపమ చేసిన తాజా వ్యాఖ్యలతో ఆ రూమర్లకు చాలా వరకు ఫుల్‌స్టాప్ పడినట్టే కనిపిస్తోంది.చూడాలి మరి దీనికి కౌంటర్ గా ద్రువ్ ఏమైనా కామెంట్ వదులుతాడో !