వచ్చే ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లు GEN-Zవే – కేటీఆర్..!

నరేంద్ర మోదీ ఎవరితోనూ పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని, పర్యవసానంగా జెన్‌జీ (Gen-Z)ల దెబ్బకి అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, ‘వాట్సాప్ అంకుల్స్’ కి, ‘ఇన్‌స్టాగ్రామ్ పిల్లల’కి మధ్య జరిగిన పోరాటంగా ఆయన అభివర్ణించారు.

 

సోషల్ మీడియా శక్తిపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాలు, నాయకుల్లో జవాబుదారీతనం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ వార్తా ఛానెళ్లను పక్కనపెట్టి, ఇప్పటి యువత ప్రతీ విషయాన్ని, వార్తలను రీల్స్ రూపంలోనే వీక్షిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దాదాపు 50 శాతానికి పైగా జెన్‌జీ యువతే ఓటర్లుగా మారబోతున్నారని, ప్రజాస్వామ్యంలో వారి ప్రభావం ఎంతటి శక్తివంతంగా ఉండబోతోందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.