టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ ఈ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా, ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన ఆరోగ్య రహస్యాలు, రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు శారీరక శ్రమకు ఎంతో ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా 15 వేల అడుగులకు పైగా నడుస్తానని మురళీ మోహన్ వెల్లడించారు. అయితే ఒకేసారి మొత్తం వాకింగ్ పూర్తి చేయకుండా.. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో విడతల వారీగా తన వాకింగ్ టార్గెట్‌ను పూర్తి చేసుకుంటానని చెప్పారు. రోజువారీ జీవితంలో ఈ అలవాటును ఒక భాగంగా చేసుకున్నట్లు తెలిపారు.
ప్రయాణాలు ఉన్నప్పటికీ తన వాకింగ్ రొటీన్‌ను ఏమాత్రం మిస్ కాకుండా చూసుకుంటానని మురళీ మోహన్ పేర్కొన్నారు. వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, నిరంతర శారీరక శ్రమ ఎంతో ముఖ్యమని ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆయన ఫిట్‌నెస్ రొటీన్‌పై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.