జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై జనగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మాణిక్యపురం గ్రామానికి చెందిన రాములు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.