అనసూయ గ్లామర్ విందు: ఫొటోస్ చూసి కుర్రాళ్ళు ఆగమాగం, కామెంట్స్ అయితే పీక్స్ భయ్యా!

బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తనదైన ముద్ర వేసిన ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. నిత్యం సరికొత్త అవుట్‌ఫిట్లతో, ట్రెండీ లుక్స్‌తో అభిమానులను అలరించే అనసూయ.. తాజాగా చేసిన ఫోటోషూట్ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అదిరిపోయే ఫోజులతో ఆమె ఇచ్చిన గ్లామర్ విందుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫొటోస్ కాస్తా సోషల్ మీడియా వేదికలపై వైరల్‌గా మారడంతో అభిమానులు షేర్లు, లైకులతో రచ్చ చేస్తున్నారు.

ఈ ఫోటోలలో అనసూయ అందాల ప్రదర్శన, ఆమె మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు “వామ్మో.. అనసూయ ఏంటిలా తయారైంది, కుర్రాళ్లను ఆగమాగం చేస్తోంది” అంటూ కొంటె కామెంట్లు పెడుతున్నారు. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆమె గ్లామర్ అస్సలు తగ్గడం లేదని, మరింత హాట్‌గా తయారవుతోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ ఫోటోలపై పెడుతున్న క్రేజీ కామెంట్స్, ఎమోజీలు అయితే పీక్స్‌కు చేరుకున్నాయని చెప్పాలి. నెగెటివ్ కామెంట్స్ చేసేవారికి గట్టిగా కౌంటర్లు ఇచ్చే అనసూయ.. ఇలాంటి బ్యూటిఫుల్ ఫోటోలతో తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

ప్రస్తుతం అనసూయ కేవలం గ్లామర్ షోకే పరిమితం కాకుండా.. వైవిధ్యమైన పాత్రలతో సినిమాల్లోనూ బిజీగా గడుపుతోంది. రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించిన ఈ బ్యూటీ, రాబోయే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులలో కీలక పాత్రలు పోషిస్తోంది. ఒకవైపు షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటూ ఇలాంటి క్రేజీ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *