తేది:30-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన గుంటి భూమ్మవకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా మంజూరైన చెక్కును టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక పెద్ద అండగా నిలుస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా అవసరం ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సహాయం అందుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా అనారోగ్యం, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో చికిత్స ఖర్చులు భరించలేని వారికి ఈ నిధి ద్వారా ప్రభుత్వం వెంటనే చేయూతనిస్తుందని తెలిపారు. లబ్ధిదారురాలు గుంటి భూమ్మవ ప్రభుత్వం అందించిన ఈ సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కిసాన్ సెల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మల్లాపూర్ మండల అధ్యక్షుడు కొమ్ముల చిన్నారెడ్డి, ఇబ్రహీంపట్నం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నల్లూరి సాగర్, ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూత్త నారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి అమ్ముల పవన్, వినోద్, మిట్టపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.