ఆ సినిమా విషయంలో నిర్మాతలతో గొడవ పడ్డా: మృణాల్‌..

తాను నటించిన ‘పూజా మేరీ జాన్’ చిత్ర నిర్మాతలతో గొడవ పడ్డానని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ఈ కథ కోసం మరో నటిని ఎంచుకోవడమే ఇందుకు కారణమట. ‘ఈ మూవీలో పాత్ర నాకెంతో నచ్చింది. నా నిజ జీవితానికి ఈ కథతో దగ్గర సంబంధం ఉంది. ఇలాంటి రోల్లో నటించాలని ఎదురుచూస్తున్నా. అయితే వేరే నటి కోసం చూస్తున్నారని తెలిసి గొడవ పడ్డా. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలను రిక్వెస్ట్ చేసి ఇందులో నటించా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *